తులాభారం సెట్స్‌లోకి..
మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Ravi Teja), దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘తులాభారం(Thulabharam)’. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ యూనిక్ స్టుల్ స్టోరీ టెల్లింగ్ కలగలిసి క్రైమ్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. రవితేజ.. ఈ కొత్త ప్రాజెక్టుతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందులో ‘మాస్ మహారాజా’కు బదులుగా ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం అవుతున్నారు. ‘నవ రవితేజం’గా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. అయితే, ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా హీరో రవితేజ తన ఫస్ట్ డే షూట్‌లో పాల్గొన్నారు. ఆయనతోపాటు కీలక నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్; సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్ ఐఎస్‌సీ; ఎడిటర్: రవితేజ గిరిజాల; ఆర్ట్: జీఎం శేఖర్.