అచ్చం నల్లచీర..

07-11-2026 | 05:15am

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) హీరోగా, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’(Tyson Naidu). 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ను విడుదల చేశారు. ‘అచ్చం నల్లచీర.. చీరంచున మల్లెమొగ్గ.. దాని కొంగున కోడిపుంజు.. మదరాసీ రబ్బరు బొమ్మ.. దానిపైనే ఉన్నది మోజు.. మదరాసీ రబ్బరు బొమ్మ..’ అంటూ సాగుతోందీ ఫోక్ బాంగర్. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించగా.. నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సొరట్ పాడారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: ముకేశ్ జ్ఞానేశ్; ఆర్ట్: అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు. 


మరిన్ని వార్తలు