వేగా జ్యువెలర్స్ నూతన షోరూమ్

07-11-2026 | 05:05am

దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా ప్రారంభం

ఆభరణాల ప్రియులకు శుభవార్త.. ప్రముఖ ఆభరణాల సంస్థగాపేరొందిన వేగా జ్యువెలర్స్(Vega Jewelers) తమ నూతన షోరూమ్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. వేగా జ్యువెలర్స్ ప్రచారకర్త, సంస్థకు అత్యంత ఆత్మీయులు నందమూరి బాలకృష్ణ(బాలయ్య బాబు)(Nandamuri Balakrishna) శుభాశీస్సులతో నూతన షోరూమ్‌ను ప్రముఖ సినీ నటి ప్రగ్యా జైస్వాల్ ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో తిరుగుతూ ఖాతాదారులతో కలిసి ఆమె సందడి చేశారు.

నూతన షోరూ మ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరక్టర్ నవీన్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుధాకర్ వనమాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇది మా ౭వ షోరూ మ్ అని, హైదరాబాద్ నగరంలో రెండవదని తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టామని చెప్పారు. బంగారు ఆభరణాలు వేస్టేజీ 2.99%నుంచి11.99% వరకు ఉంటుందని, తయారీ(మేకింగ్) చార్జీలు ఉండవని తెలిపారు.

వజ్రాల ఆభరణాల క్యారట్ ధర రూ.47,999లు ఉంటుందని, ఈ ప్రత్యేక ఆకర్షణీయమైన ఆఫర్లు నవంబర్ 6 నుంచి నవంబర్ 30 వరకు మాత్రమే ఉంటాయని చెప్పారు. నూతన షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన మెగా గోల్డ్ లక్కీడ్రా నిర్వహిస్తున్నామని మొత్తం 100 మంది విజేతలకు ఒక్కొక్కరికి 5 గ్రాముల 24 క్యారట్ బంగా రం చొప్పున మొత్తం 500 గ్రాముల బంగా రం విజేతలకు అందించనున్నామని వారు వివరించారు.

దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతల ప్రజలు, ఆభరణాల ప్రియులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేగా జ్యువెలర్స్ నూతన షోరూమ్‌ను సందర్శించి ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్లను పొందాలని సంస్థ ఆహ్వానిస్తోంది. రాబోయే వివాహాల సీజన్ కోసం ప్రత్యేకమైన డిజైన్స్‌లో అపురూపమైన బ్రైడల్ కలెక్షన్స్ ఈ ఆఫర్ కాలంలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 


మరిన్ని వార్తలు