రామప్ప ఆలయ హుండీ లెక్కింపు
ఆదాయం రూ.8.73 లక్షలు
వెంకటాపూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన(Ramappa Sri Ramalingeswara Swamy Temple) మండపంలో బుధవారం పరిశీలకులు డి అనిల్ కుమార్ సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించగా మొత్తం ఆదాయం రూ. 8,73,570 వచ్చినట్లు కార్యనిర్వాహణాధికారి భాస్కర్ వెల్లడించారు.
అందులో నోట్ల రూపంలో రూ. 7,85,720 రాగా, నాణేల రూపంలో రూ. 87,850 వచ్చినట్లు వారు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు, భక్తులు సమర్పించిన ఈ విరాళాలను ఆలయ అభివృద్ధి మరియు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు భాస్కర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు హరీష్ శర్మ, అర్చకులు ఉమాశంకర్, డిప్యూటీ తహసీల్దార్ భవాని ప్రసాద్, గ్రామ సర్పంచ్ రాజు, ఆర్ఐ రమేష్, టూరిజం గైడ్లు విజయ్, వెంకటేష్, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు, పోలీస్, పురావస్తు శాఖ సిబ్బందీలు పాల్గొన్నారు.