పేద కుటుంబాలకు పొంగులేటి ఆపన్నహస్తం!

04-11-2026 | 07:13pm
  1. కుటుంబ పెద్దను కోల్పోయిన ప్రతి ఇంటికి ఆర్థిక చేయూత..
  2. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.10 వేల రూపాయల ఆర్థిక సాయం..

కూసుమంచి, నవంబర్ 4(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 48 పేద కుటుంబాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అండగా నిలుస్తున్నారు. శ్రీనన్న ఆత్మీయ భరోసా కార్యక్రమం ద్వారా మృతుల కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ, కష్టకాలంలో తాము అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు.

రాజకీయాలకు అతీతంగా మానవత్వమే ప్రధానంగా పేద కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమం బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూతతో పాటు ఆత్మీయ ధైర్యాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. "కుటుంబ పెద్దను కోల్పోయిన బాధను ఎవరూ తీర్చలేరు.

కానీ, మా కష్టాన్ని గుర్తించి, దుఃఖ సమయంలో మమ్మల్ని ఆదుకుంటూ మాకు ఆర్థిక సాయం అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆప్యాయతను జీవితాంతం మరిచిపోలేం అని ఆపదలో ఉన్న మా కుటుంబాలకు అండగా నిలిచిన శ్రీనన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని భావోద్వేగంతో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, సీడీసీ చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీలు జుకూరి గోపాలరావు, బాణోత్ శ్రీనునాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, కంచర్ల జీవన్ రెడ్డి, చాట్ల పరుశురాం, జర్పుల శ్రీను నాయక్,రవి, చిలక బత్తిని రామారావు బానోత్ సత్యం, సర్పంచులు మరియు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది...

మరిన్ని వార్తలు