గర్భిణీ మహిళలకు బాలామృతం, గుడ్లు, పాలు పంపిణీ
సర్పంచ్ కొత్త శృతి అరవింద్ రెడ్డి
దేవరకద్ర, కౌకుంట్ల నవంబర్ 4 (విజయ క్రాంతి): మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండల పరిధిలోని పేరూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో(Anganwadi Centre) బుధవారం గర్భిణీ మహిళలకు బాలామృతం, గుడ్లు, పాలను గ్రామ సర్పంచ్ కొత్త శృతి అరవింద్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శృతి మాట్లాడుతూ గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని, తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా పౌష్టికాహారం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.