సిపిఐ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను ఆపాలి

10-10-2026 | 09:39pm

అరెస్టులకు నిరసనగా మోదీ దిష్టిబొమ్మ దహనం

మేడిపల్లి మండలo సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి మండల(Medipalli Mandal) పరిధిలోని ఉప్పల్ బస్ డిపో ఎదురుగా వరంగల్ హైవేపై మేడిపల్లి మండల సీపీఐ కార్యదర్శి రచ్చ కిషన్(CPI Secretary Rachha Kishan) ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ(PM Modi Effigy)ను దహనం చేసి నిరసన తెలిపారు. జ్ఞానేశ్వర్ కుమార్‌(Gnaneshwar Kumar)ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా నిర్వహించేందుకు బయలుదేరిన సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శులు సిహెచ్ మాధవి, జి నాగరాజు బి కే ఎం యు మండల అధ్యక్షులు భూతం ఐలయ్య, సిపిఐ పార్టీ నాయకులు ఇస్తారి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు