ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఆదివాసులను నియమించాలి
జిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర
ఆదివాసి భూములకి రక్షణ కావాలంటే ఆదివాసులనే నియమించాలి.
వెంకటాపురం, నూగూరు నవంబర్ 27, విజయక్రాంతి : వెంకటాపురం మండలం(Venkatapuram Mandal) కొమరంభీం కాలనీ ఆవరణలో శుక్రవారం గొండ్వానా సంక్షేమ పరిషత్(Gondwana Welfare Council) ముఖ్య కార్యకర్తల సమావేశంలో ములుగు జిల్లా(Mulugu District) అధ్యక్షులు పూనెం ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జి.ఎస్.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర పాల్గొని మాట్లాడుతూ.ఎస్టి కమిషన్ చైర్మన్ గా లంబాడ తెగకు సంబంధించిన వ్యక్తులని చైర్మన్ గా నియమిస్తామని ముఖ్యమంత్రి మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎస్టి కమిషన్ చైర్మన్ గా ఆదివాసి తెగ నుంచి నియమించాలని డిమాండ్ చేశారు.
5వ షెడ్యూల్డ్ భూ భాగమంతా రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివాసి చట్టాలను అమలు కాకుండా అడ్డుపడేది కాంగ్రెస్ పార్టీ అని ఇది ఆదివాసి సమాజం గమనించాలని తెలిపారు.ఎస్టీ చైర్మన్ గా ఆదివాయులనే నియమించేలా ఆదివాసి ఎమ్మెల్యేలు అందరూ కలిసి టిఏసి గిరిజన శాసన మండలి తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిఎస్పీ విద్యార్థి విభాగం నాయకులు పూనెం నితిన్,మడకం తిరుపతి,పార్ధు దొర,చంటి,సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు