కూలీకి బడ్జెట్ కు లింక్..!
- 123 గ్రామాలలో దోమల మందు స్ప్రే
- పిచికారీ డబ్బుల కోసం ఎదురుచూపులు
- బడ్జెట్ లేదంటూ అధికారుల దాటవేత
- సాయం చేయాలంటూ మంత్రి సీతక్క, అధికారులకు కూలీల విజ్ఞప్తి
ములుగు, నవంబర్ 24 (విజయక్రాంతి): కూలీ డబ్బులకు(wages for labor) బడ్జెట్ తో ముడి పెడుతూ 16 నెలలుగా కాలయాపన చేస్తున్న అధికారుల నిర్లక్ష్యం ములుగు జిల్లాలో(Mulugu District) చోటు చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా వ్యాధులు ప్రబలకుండా దోమల మందు పిచికారి(Spraying mosquito repellent) చేసిన కూలీ డబ్బుల కోసం కూలీలు ఎదురుచూడాల్సిన దుస్థితి నేడు జిల్లాలో నెలకొంది. రెక్కాడితే గాని డొక్కాడని రోజువారి దినసరి కూలీ డబ్బుల కోసం బడ్జెట్ కు(Budget) పొంతన పెట్టడం విడ్డూరంగా ఉంది. వివరాల్లోకి వెళితే జిల్లాలో కొంతమంది కూలీలు గత కొన్ని సంవత్సరాలుగా దోమల మందు పిచికారి చేస్తూ, వ్యవసాయ కూలీ పనులు(Agricultural labor tasks) చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
అయితే గత సంవత్సరం 2025 జూన్, జూలై, ఆగస్టు నెలలో సుమారు వందమంది కూలీలకు సంబంధించిన ఎనిమిది లక్షల రూపాయలు దోమల మందు పిచికారి డబ్బులు నిలిచిపోయాయి. వర్షాకాలం ఆరంభంలో దోమల ద్వారా వ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 123 గ్రామాల్లో, పలు గొత్తికోయ గూడాలలో కూలీల ద్వారా దోమల మందులు పిచికారి చేశారు. ఇందుకు సంబంధించి పంపులను, దోమల మందును వైద్య ఆరోగ్యశాఖ కూలీలకు అందజేసి కూలీల ద్వారా పిచికారి చేయిస్తుంది.
ఈ క్రమంలో గత సంవత్సరం దోమల మందు పిచికారి చేసిన కూలి డబ్బులు నేటికీ రాకపోవడంతో కూలీలంతా నిరాశ చెందుతున్నారు. ఇదే సమస్యపై అధికారులను కూలి పనులను మానుకొని మరి సంప్రదించిన ఫలితం లేదని, నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్న తమకు కూలీ డబ్బులు రావడంలేదని వాపోతున్నారు.
కూలి డబ్బులు వస్తాయని ఆశతో కిరాణా, కూరగాయల దుకాణంలో ఖాతాలు పెట్టామని కూలీ డ బ్బులు రాకపోవడంతో వాళ్లంతా ఇంటి మీదికి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని, ఆత్మాభిమానం చంపుకోలేక కూలీ డబ్బులపై ఆశతో ఎదురుచూస్తున్నామని ఈ సందర్భంగా పలువురు కూలీలు వాపోతున్నారు. ఏది ఏమైనా కూలీ డబ్బుల కోసం బడ్జెట్ రాలేదంటూ సమయం పొడిగించడం తమను తీవ్ర నిరాశ గురి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
16 నెలలుగా ఎదురుచూపులు
గత 16 నెలలుగా కూలీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నామని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసిన తమ కూలీ డబ్బులు మాత్రం దక్కడం లేదని దోమల పిచికారి కూలి రేండ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు రాకపోవడంతో ఆర్థిక సమస్యలు తమని తీవ్రంగా వేధిస్తున్నాయని మంత్రి సీతక్క, అధికారులు స్పందించి తమ కూలి డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
రేండ్ల శ్రీనివాస్, దోమల మందు పిచికారి కూలి
బడ్జెట్ కోసం అధికారులకు నివేదిక
జిల్లా వ్యాప్తంగా 123 గ్రామాల్లో దోమల మందు పిచికారి చేసిన విషయం వాస్తవమేనని, గత కొన్ని సంవత్సరాలుగా వ్యాధులు ప్రబలకుండా దోమల మందు పిచికారి చేస్తున్నామని ఇంచార్జ్ అసిస్టెంట్ మలేరియా అధికారి దుర్గారావు విజయక్రాంతి ప్రతినిధికి తెలిపారు. అయితే 2025 జూన్ జూలై ఆగస్టు నెలలో దోమల మందు పిచికారి చేసిన సుమారు 8 లక్షల రూపాయల బడ్జెట్ కోసం ఉన్నతాధికారులకు పంపించామని, ఇప్పటివరకు బడ్జెట్ రాకపోవడంతో కూలీల డబ్బులు ఇవ్వలేకపోయామని తెలిపారు. ఉన్నతాధికారులు దీనిపై తీవ్రంగా కృషి చేస్తున్నారని సకాలంలోనే వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇంచార్జ్ అసిస్టెంట్ మలేరియా అధికారి జినుకల దుర్గారావు