అధికారుల సేవలకు జర్నలిస్టుల అభినందన

04-11-2026 | 06:47pm

రామప్ప ఆలయ ఈవో, ఇన్‌స్పెక్టర్‌ లకు జర్నలిస్టుల సన్మానం

వెంకటాపూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయ(Ramappa Temple) అభివృద్ధికి కృషి చేస్తున్న ఆలయ కార్యనిర్వహణాధికారి ఇమ్మడి భాస్కర్, ఆలయ ఇన్‌స్పెక్టర్ అనిల్‌ ను బుధవారం వెంకటాపూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఓద్దుల మురళి ఆధ్వర్యంలో జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు బేతి సతీష్ యాదవ్, పిల్లలమర్రి శివ, బానోత్ యోగి, గోరంట్ల విజయ్ కుమార్, దండపెళ్లి సారంగం గౌడ్, పిల్లలమర్రి రాము, గునుగంటి హరీష్, రామప్ప ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్, దేవాలయ సిబ్బందిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు