ప్రమాద బాధితులకు అండగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ

20-11-2026 | 04:40pm

గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇల్లు దగ్ధం

సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి నిత్యావసర సరుకుల అందజేత

మంగపేట /కన్నాయిగూడెం, నవంబర్ 20(విజయక్రాంతి): ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) స్వచ్ఛంద సంస్థ మానవత్వాన్ని చాటుకుంది. ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన ఇందారపు చంచు లక్ష్మి కుటుంబం గ్యాస్ సిలిండర్ పేలుడుతో(Gas Cylinder Explosion) జరిగిన అగ్నిప్రమాదంలో(Fire accident) ఇల్లు దగ్ధమై సర్వస్వం కోల్పోయింది.

ఈ ఘటనలో నిరాశ్రయులైన బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ అల్లెం అప్పయ్య ముందుకు వచ్చారు. బాధిత కుటుంబానికి వంట సరుకులతో పాటు నిత్యావసర వస్తువులను అందజేసి ఆపన్నహస్తం అందించారు.ఆపద సమయంలో బాధితులకు అండగా నిలవడం, మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. కష్టకాలంలో తమకు సహాయం అందించిన రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎంసీ సభ్యులు అబ్బు సతీష్, వావిలాల రవితేజ, మంగపేట మండల సీనియర్ జర్నలిస్ట్ జానపట్ల జయరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు