కరెంట్ కోతలను నిరసిస్తూ బిఆర్ఎస్ మహాధర్నా
నాగర్ కర్నూల్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తిమ్మాజిపేట మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి(Former MLA Marri Janardhan Reddy) పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని మర్రి జనార్దన్రెడ్డి కోరారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న సమయంలో విద్యుత్ సమస్యలు తలెత్తితే తీవ్రంగా నష్టపోతారని విద్యుత్ శాఖ అధికారులు తిమ్మాజిపేట మండలంలో సరఫరా సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.