అనుమతులు,భద్రత.. తాత్కాలికమే!
- ప్రమాదకర స్థాయిలో క్రాకర్స్ దుకాణాలు
- కొన్ని వాటికే అనుమతులు
- మామూలుగా తీసుకుంటున్న అధికారులు.
- భారీగా ఇళ్ల మధ్యే ప్రమాదకర క్రాకర్స్ నిల్వలు.?
- భయాందోళనలో సామాన్యులు
నాగర్ కర్నూల్ నవంబర్ 6 (విజయక్రాంతి) దీపావళి సందర్భంగా టపాకాయల విక్రయాల్లో(Cracker Shops) వ్యాపారాలు భద్రతా ప్రమాణాలు గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలున్నా యి. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా దు కాణదారులు భద్రత ప్రమాణాలను అనుమతుల మాదిరిగానే తాత్కాలికంగా పాటిస్తు న్నారని విమర్శలున్నాయి. జిల్లా కేంద్రంలో ని జడ్పీ మైదానంలో సుమారు 14 దుకాణాలను ఒకే చోట ఏర్పాటు చేసిన వ్యాపా రులు, కొన్ని వాటికే అనుమతులు పొందారని తెలుస్తోంది.
ప్రతి తాత్కాలిక దుకాణా నికి ఆయా శాఖల నుండి లైసెన్స్ తప్పనిసరి కానీ కొన్ని వాటికి అనుమతులు లేకుండానే గుంపులో గోవిందా అన్న మాదిరి వ్యవహారిస్తున్నారని అధికారులు చెబుతున్న వివరాలను బట్టి తెలుస్తోంది. విద్యుత్ శాఖ నుండి తాత్కాలిక అనుమంతుల పేరిట 12 దుకాణాలున్నట్లుగా డిడి చెల్లించినట్లు విద్యుత్ శాఖ ఏఈ పేర్కొన్నారు. కానీ 14వాటికీ కలిపి ఒకే దగ్గర విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి అద్ధం పడుతుంది.
తద్వా రా లోడ్ పెరిగి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవేవీ గమనించ కుండానే అగ్నిమాపక శాఖ అధికారులు సైతం 13 దుకాణాలకు ఎన్వోసీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాత్కాలిక దుకాణాల్లో విక్రయిస్తున్న టపాకాయలను నిబంధనలకు విరుద్ధంగా వారి వారి ఇళ్లల్లో ఇతర గోదాముల్లో ఇళ్ల మధ్య స్టోర్ చేస్తున్నట్లు ఆయా కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడటం అంటుంచితే అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
అయినా పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపడం లేదన్న విమర్శలున్నాయి. టపాసుల వలె ధరలు కూడా అమాంతం పెరిగాయని క్రయ విక్రయాలు బిల్లులు ఇవ్వకుండా వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం పట్ల సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
లక్షల విలువజేసే టపాకాయలు స్టోర్ చేసిన దుకాణాల్లో తక్కువ ఉన్నట్లు రాసుకుని సంబంధిత అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రత ప్రమాణాల విషయంలో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లక ముందే సంబంధిత అధికారులు స్పందించి దుకాణాలు, నిల్వ కేంద్రాలపై తనిఖీలు చేపట్టాలని, ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అచ్చంపేటలో అనుమతులు రద్దు.
జనావాస సంచారం ప్రాంతంలో 10 క్రాకర్స్ దుకాణాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోగా నలుగురు దుకాణదారులు దరఖాస్తు చేసుకోగా పరిశీలించిన అనంతరం అనుమతులు రద్దు చేసినట్లు ఫైర్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. పట్టణ కేంద్రంలోని కన్నయ్య రైస్ మిల్ అనే ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా క్రాకర్స్ దుకాణం ఏర్పాటు చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు.