మార్కెట్ చైర్మన్ గోపాల్రెడ్డికి పబ్లిక్ క్లబ్ ప్రతినిధుల సన్మానం.
15-10-2026 | 07:56pm
అచ్చంపేట, అక్టోబర్ 15: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ(Achampet Agricultural Market Committee) నూతన చైర్మన్ అడుపాల గోపాల్రెడ్డిని గురువారం పబ్లిక్ క్లబ్ ప్రతినిధులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వారి సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి కానోజ్ మనోహర్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు కందికొండ శ్రీధర్, కోశాధికారి పోకల ప్రవీణ్, సహాయ కార్యదర్శి మహమ్మద్ ఫయుం, క్రీడా కార్యదర్శి మందుల దశరథం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.