నార్లాపూర్ నుండి ఎల్లూరుకు నీటి విడుదల

21-10-2026 | 04:21pm

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. 

కొల్లాపూర్ అక్టోబరు 21: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ లోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును(Palamuru-Rangareddy Project) పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం  చేశారని. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)  అన్నారు. బుధవారం నార్లాపూర్  నుంచి ఏల్లూరు రిజర్వాయర్లోకి నీటిని విడుదల(Release of water) చేసిన. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండిపడ్డారు.

నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎల్లూరు  రిజర్వాయర్‌ నుంచి  1000 క్యూసెక్కుల ద్వారా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Mahatma Gandhi Kalwakurthy Lift Irrigation Scheme) పరిధిలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, వనపర్తి నియోజకవర్గాల్లో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం కలగనుందని వివరించారు. సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్‌ భగీరథ(Mission Bhagiratha) ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం సహా కీలక పనులు ఇంకా కొనసాగుతున్నాయని, అవి పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు కాలువల పనులు ఇంకా పూర్తికావాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

మార్గమధ్యంలో మూడు చోట్ల  తండు తవ్వకాలు చేపట్టాల్సి ఉండటంతోపాటు బ్రిడ్జిల నిర్మాణం కూడా కొనసాగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో రాతి నేల ఉండటంతో తవ్వకాలకు సమయం పడుతోందని వివరించారు. ఈ పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాలువల నిర్మాణం పూర్తిచేసి నీటిని సజావుగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు చేపట్టాల్సిన పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేది కాదని జూపల్లి అన్నారు. మూడో ప్యాకేజీలో పనులను అసంపూర్తిగా వదిలేయడం వల్లే ప్రస్తుతం వాటిని పూర్తిచేయాల్సి వస్తోందని విమర్శించారు. గతంలో నిలిచిపోయిన పనులను ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని, కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేటీఆర్‌ సహా బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మంత్రి అన్నారు. నీటిని విడుదల చేయాలని కోరడం సులువేనని, అయితే ఆ నీరు కాలువల ద్వారా ఎక్కడికి చేరుతుందో కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించారు. నిర్మాణ పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే ఆశించిన ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించి వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని సూచించారు. గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అసంపూర్తి పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి. మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమలాకర్ రావు. పసుపుల నరసింహ. కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు