సీఈసీ రాజీనామా చేయాలి
15-10-2026 | 04:09pm
ఎంపీ మల్లు రవి
అచ్చంపేట, అక్టోబర్ 15: ఢిల్లీలోని జంతర్ మంతర్ను(Jantar Mantar) అధికారిక నిరసన వేదికల జాబితాలో కొనసాగించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) డిమాండ్ చేశారు. గురువారం అచ్చంపేటలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు జంతర్ మంతర్ను నిరసన వేదికగా కొనసాగించాలన్నారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.