పుట్టలగడ్డ లో ఇందిరమ్మ ఇంటి ప్రారంభిన ఎమ్మెల్యే
దామరచర్ల :అక్టోబర్ 30 : దామరచర్ల మండలం లోని పుట్టలగడ్డ గ్రామంలో నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ ఇంటిని(Indiramma house) కాంగ్రెస్ పార్టీ నాయకుల తో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshma Reddy) శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని.
రెండో విడతలో మరో 2,200 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు పార్టీలకు అతీతంగా నేరుగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ గొప్ప ఘనత అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు* వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొర్ర నాగునాయక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు పగిడి రామలింగ యాదవ్, మాజీ పార్టీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, సర్పంచ్ లు ఇంజం నర్సిరెడ్డి, దానవత్ పార్వతి లక్ష్మానాయక్, హతిరం
మాజీ సర్పంచులు జనార్దన్ నాయక్, రూపావత్ బాషా నాయక్, నెహ్రూ నాయక్, లింగ నాయక్, రవి తేజ నాయక్, దానవత్ కిషన్ నాయక్బి, తూర్పు తండా ఇంచార్జ్ బాలా నాయక్, శాంతినగర్ ఇంచార్జ్ శివ చరణ్ నాయక్, నర్సాపురం ఇంచార్జ్ శివ నాయక్, పాత్తులోతు భాను నాయక్, మునోత్ ఆనంద్ నాయక్, కోట శ్రీనివాస్, శివ నాయక్, చరణ్ నాయక్ తదితర పాల్గొన్నారు.