ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

20-11-2026 | 02:57pm

దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో సోహం ఇథనాల్ పరిశ్రమ(Soham Ethanol Industry) ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీర్లపాలెం వద్ద శుక్రవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు సానుకూలత వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు నది, భూగర్భ జలాలు కలుషిత కాకుండా చర్యలు తీసుకోవడం తోపాటు పరిసర గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ వెంకన్న(Pollution Control Board EE Venkanna), ఆర్డీవో రమణారెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్  జిల్లా అధికారులతోపాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు