జాదవరాపల్లిలో ఫారంపాండ్ పనుల పరిశీలన.. నాణ్యతపై దృష్టి
మద్దూర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మండలంలోని జాదవరాపల్లి గ్రామంలో వి.బి.జి. రామ్‌జీ పథకంలో భాగంగా చేపడుతున్న జలసిరి పనుల్లో ఫారంపాండ్ పనులను బుధవారం అధికారులు పరిశీలించారు. జిల్లా పరిషత్ నారాయణపేట డిప్యూటీ సీఈఓ, మద్దూర్ ఎంపీడీవోలు గ్రామాన్ని సందర్శించి పనుల Progressను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫారంపాండ్ పనుల వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో Quality పూర్తి చేయాలని సూచించారు. పనుల నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పనుల Siteను పరిశీలించారు. ఈ పరిశీలనలో గ్రామ సర్పంచ్ సాయప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్, టీఏ మురళీమోహన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.