ఢిల్లీలో తిరంగా యాత్రకు బ్రేక్.. అభిజీత్ దీప్కే అదుపులోకి!
16-10-2026 | 05:42pm
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తిరంగా యాత్ర(Tiranga Yatra) ఉద్రిక్తతకు దారితీసింది. యాత్రలో పాల్గొనేందుకు బయల్దేరిన అభిజీత్ దీప్కే(Abhijeet Deepke)ను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. యాత్రకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. అభిజీత్ దీప్కే ర్యాలీగా బయల్దేరిన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకున్నారు. మరోవైపు, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్(Connaught Place) పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. యాత్ర నిర్వాహకుల స్పందన, అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.