హస్తినలో హైటెన్షన్
జ్ఞానేశ్ బ్రో బై బై
సీఈసీ జ్ఞానేశ్‌ను తొలగించే వరకూ పోరు ఆగదన్న ఇండీ నేతలు
- జంతర్‌మంతర్, షాంగ్రీలా హోటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- జంతర్‌మంతర్‌లో నేలపై పడుకున్న ప్రియాంక
- రాహుల్, ప్రియాంకను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నాపై 100 కేసులైనా బెదిరే ప్రసక్తే లేదు..
- ఎఫ్‌ఐఆర్‌లు నాకు పతకాలు: రాహుల్
- ఎంపీలను కొడతారా.. ఈడ్చి పడేస్తారా..
- రాజ్యాంగం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం: ప్రియాంక
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను(Election Commissioner Gyanesh Kumar) తొలగించాలని, సర్ ప్రక్రియను(Sar process) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇండీ కూటమి ఎంపీల నిరసనలతో(Protests by Indy Alliance MPs) బుధవారం కూడా దేశ రాజధాని అట్టుడికింది. మంగళవారం ఆకాశవాణి భవన్ వద్ద ఆందోళనలు హోరెత్తగా, బుధవారం జంతర్‌మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. లంచ్ మీట్ తర్వాత ఈసీ ఆఫీసుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు బస్సు ల్లో తరలివెళ్లారు.
అయితే షాంగ్రి-లా హోటల్ సమీపంలో పోలీసు లు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డపైనే భైటాయించి నిరసన తెలిపారు. దీంతో జంతర్‌మంతర్ సమీపంలో పరిస్థితి హైటె న్షన్‌గా మారింది. రాహుల్‌గాంధీని, ప్రియాంకగాంధీని(Priyanka Gandhi) అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు రోడ్డుపైనే సీఈసీని తొలగించాలని నినదించారు. పోలీసులతో రాహుల్, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్, ప్రియాంక దగ్గరికి పోలీసులు రాకుండా చుట్టూ ఎంపీ లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రక్షణ వలయంగా నిల్చున్నారు.
ఓ క్రమంలో ప్రియాంకగాంధీ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే రాహుల్, ప్రియాంక, విపక్ష ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రాహు ల్‌ని ఛత్రసాల్ స్టేడియానికి తీసుకెళ్లాల్సిన బస్సు టైర్లను కాంగ్రెస్ కార్యకర్తలు పంక్చర్ చేశారు. దీంతో ఆయనను వేరే బస్సులో బారాఖంబా రోడ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రియాంక గాంధీని, ఇతర ప్రతిపక్ష నాయకులను ఛత్రసాల్ స్టేడియానికి తీసుకెళ్లారు. ఛత్రసాల్ స్టేడియం వద్ద కూడా పరిస్థితి తీవ్ర ఉత్కంఠంగా మారింది. ఎంపీలను కొడుతారా, ఈడ్చి పడేస్తారని రాహుల్‌గాంధీ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ, ఇతరులను ‘న్యాయం ముందు నిలబెడ తాం’ అని ఆరోపించారు. ఆ నలుగురు రాజ్యాంగంపై, ప్రజల వాణిపై దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. షాంగ్రి-లా హోటల్ సమీపంలో రాహుల్‌గాంధీని బలవంతంగా అదు పులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించగా, అందులో కూర్చునే ఆయన మాట్లాడారు. దేశంలోని ‘అత్యంత పవిత్రమైన అంశాన్ని‘ కాపాడుకునే పోరాటం ఇదని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞనేష్ కుమా ర్ రాజీనామా చేసే వరకు ప్రతిపక్షాల నిరసన ఆగదని తేల్చిచెప్పారు. తమను అడ్డుకు నేలా ప్రధాని నరేంద్ర మోదీ లేదా హోం మంత్రి అమిత్ షా చేయగలిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
ఈ మేరకు కూడా ఆ యన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో లో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జ్ఞనేష్ కుమార్ ఇవన్నీ చేయవచ్చని ఆరోపించారు. ‘కానీ మేము వారిని చట్టం ముందు నిలబెడతాం. ఆ నలుగురినీ చట్టం ముందు నిలబెడతామని నా హామీ’ అని పేర్కొన్నారు. వారు ఈ దేశంలోని అత్యంత పవిత్రమైన అంశంపై దాడి చేశారు. వారు రాజ్యాంగంపై దాడి చేశారు. ప్రజల గొంతుకపై దాడి చేశారు. దీనికి వారు మూల్యం చె ల్లించుకోక తప్పదు అని స్పష్టం చేశారు. రెండు గంటల తర్వాత బారాఖంబా పోలీస్ స్టేషన్ నుంచి రాహుల్‌ను విడుదల చేశారు.
ప్రాణాలను ఇస్తాం: ప్రియాంక
షాంగ్రి-లా హోటల్ సమీపంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియానికి పోలీసులు తరలించారు. ఇక్కడ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘పోలీసులే నన్ను కిందికి తోసేశారని, నన్ను రక్కేశారని, మమ్ములను దారుణంగా ట్రీట్ చేశారని ఆరోపించారు. రాజ్యాంగం కోసం తమ ప్రాణాలను సైతం ఇస్తామని అన్నారు. దేశం రాజ్యాంగం ద్వారా నడుస్తుంది. ఈ రాజ్యాంగం కోసం మా ప్రాణాలను సైతం అర్పిస్తాం అని ఆమె పేర్కొన్నారు.
ఎన్ని కేసులైనా పోరాడుతాం: ఖర్గే
ప్రసిద్ధసాగర్ రత్న రెస్టారెంట్‌లో విపక్ష ఎంపీలందరికీ మల్లికార్జునఖర్గే మధ్యాహ్న భోజన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న శైలిపై నేతలు చర్చించారు. అనంతరం మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని, రాజ్యాం గ బద్ధ సంస్థలను పరిరక్షించడానికి, 140 కోట్ల మంది ప్రజల హక్కుల కోసం ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా సాగిస్తామని స్పష్టం చేశారు. తర్వాత రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలంతా కలిసి ఒకే బస్సులో జంతర్‌మంతర్ వైపు బయలుదేరారు.