సరిహద్దుల్లో హైటెన్షన్

16-11-2026 | 10:45am

అడవిలో అలజడి.. 24 రౌండ్లు కాల్పులు జరిపిన జవాన్లు!

జమ్మూ కాశ్మీర్: నియంత్రణ రేఖ (Line of Control - LoC) వెంబడి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్(Poonch) జిల్లాలో అర్ధరాత్రి వేళ అడవిలో అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. సోమవారం తెల్లవారుజామున అనుమానితుల దిశగా కాల్పులు జరిపింది. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

తెల్లవారుజామున 1.30 గంటలకు అలర్ట్..

పూంచ్ జిల్లాలోని సావ్జియన్ సెక్టార్ పరిధిలో ఉన్న కనారీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు భద్రత విధుల్లో ఉన్న Army Troops సోమవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించారు. పరిస్థితిని గమనించిన జవాన్లు వెంటనే అప్రమత్తమై Small Armsతో సుమారు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరిపారు.

చొరబాట్లను అడ్డుకునేందుకు భారీ గాలింపు!

కాల్పుల అనంతరం అనుమానాస్పద కదలికలు కనిపించిన ప్రాంతాన్ని సైన్యం పూర్తిగా చుట్టుముట్టింది. ఉగ్రవాదులు సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసి ఉండవచ్చన్న అనుమానంతో Search Operation చేపట్టింది. ఎలాంటి Infiltration Attempt జరగకుండా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది.LoC సమీపంలో అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. అటవీ ప్రాంతంలో కనిపించిన వ్యక్తులు ఎవరు? వారు చొరబాటుకు ప్రయత్నించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సైన్యం గాలింపు కొనసాగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు