మంచు దుప్పటిలో కేదార్‌నాథ్

30-10-2026 | 11:41am

కేదార్‌నాథ్‌లో మంచు మాయాజాలం.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఉత్తరాఖండ్: హిమాలయ పర్వతాల్లో ప్రకృతి అందాలు మరోసారి కనువిందు చేస్తున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ మంచు కొండలు తెల్లని దుప్పటి కప్పుకున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో కురిసిన తాజా Snowfallతో ఆలయ పరిసరాలు అద్భుతమైన Winter Landscapeను తలపిస్తున్నాయి. శుక్రవారం మంచుతో నిండిన పర్వతాల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. గురువారం నుంచి ఉత్తరాఖండ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కేదార్‌నాథ్‌తో పాటు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి పరిసరాల్లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మంచు కురిసింది. దిగువ ప్రాంతాల్లో వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. కేదార్‌నాథ్‌లో చలి తీవ్రత పెరగడంతో అక్కడికి చేరుకునే యాత్రికులు Warm Clothes ధరించాలని అధికారులు సూచించారు. 

మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం సూచించింది. ప్రయాణానికి ముందు Weather Updates తెలుసుకోవాలని, అవసరమైన మందులు, వెచ్చని దుస్తులు వెంట ఉంచుకోవాలని కోరింది. కొండ ప్రాంతాల్లో వర్షం, మంచు కారణంగా రహదారులు జారుడుగా మారే అవకాశం ఉండటంతో ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరని అధికారులు సూచించారు. ఈ ఏడాది కేదార్‌నాథ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటుండటంతో ఆలయ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నవంబర్ 11న శీతాకాలం కోసం ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత శీతాకాల పూజలు ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో కొనసాగనున్నాయి.




మరిన్ని వార్తలు