అంతరిక్షంలో అద్భుతం
కాంతిదినం దూరాన్ని చేరుకున్న వాయెజర్
నాసా శాస్త్రవేత్తల హర్షం
వాషింగ్టన్, నవంబర్ 18: అమెరికాలోని నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక వాయెజర్(Voyager spacecraft) బుధవారంనాటికి ‘కాంతిదినం’ దూరాన్ని చేరుకున్న తొలి మానవ నిర్మిత స్పేస్ క్రాఫ్ట్‌గా చరిత్రకెక్కింది. శాస్త్రవేత్తలు రూపొందించిన అన్ని శాటిలైట్ల కంటే అధిక దూరం ప్రయాణించి ఈ రికార్డును సొంతం చేసుకుంది. 49 ఏళ్ల క్రితం వాయేజర్ ప్రయోగించగా, 2,590 కోట్ల కి.మీ. (26 బిలియన్ కి.మీ.) దూరం ప్రయాణించింది. ఈ దూరాన్ని కాంతి దినం అంటారు.
అంతరిక్ష నౌక వాయేజర్ ఒక కాంతి సంవత్సరాన్ని (9.46 ట్రిలియన్ కి.మీ.)చేరుకునేందుకు మరో 18వేల ఏళ్లు పడుతుందని, మరో నక్షత్రాన్ని సమీపించేందుకు రెట్టింపు సమయం పడుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాయెజర్ జాతీయ సంపదగా అభివర్ణించారు. వాయేజర్1, వాయేజర్ అంతరిక్షంలో గంటకు 61వేల కి.మీ. వేగంతో ప్రయాణిస్తూనే సమాచారాన్ని చేరవేస్తున్నాయి. కాగా వాయేజర్ సౌర వ్యవస్థను దాటే ముందు అంటే 1979, 1980 నాటికే బృహస్పతి, శని గ్రహాలను కూడా దాటేయడం గమనార్హం. 2012లో నక్షత్ర వ్యవస్థలున్న ప్రాంతానికి చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు.