ఫ్రాన్స్‌లో వ్యూహాత్మక కర్ఫ్యూ

22-10-2026 | 05:20am
  1. రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు విధింపు
  2. ప్లేస్ డి లా రిపబ్లిక్, లెస్ హాలెస్‌లో కఠిన ఆంక్షలు

పారిస్, అక్టోబర్ 2౧: ఫ్రాన్స్‌లో కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి తీవ్రమైన అల్లర్లతో అట్టుడికిన వారాంతం తర్వాత, మంగళవారం రాత్రి మొదటిసారిగా పారిస్ ప్రశాం తంగా మారింది. మరో విడత అల్లర్లు, దోపిడీలను నివారించే ప్రయత్నంలో అధికారు లు అనేక నగరాల్లో వ్యూహాత్మక కర్ఫ్యూలు(Strategic Curfews) విధించారు.

ఆదివారం సాయంత్రం, పారిస్, లియోన్, మార్సెయిల్, ఇతర నగరాల్లోని వీధుల్లో చిన్న చిన్న గుంపులు చెత్తబుట్టలు, సైకిళ్లు, ఇతర వస్తువులకు నిప్పుపెట్టి, వ్యా పార సంస్థలను దోచుకున్నాయి. రాజధానిలో, సోమవారం రాత్రి 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.

వారాంతపు ఘర్షణలకు కేంద్ర బిందువైన ప్లేస్ డి లా రిపబ్లిక్‌పై పోలీ సు హెలికాప్టర్ రాత్రంతా చక్కర్లు కొడుతూ, ఆదేశాలను పాటిస్తున్నారో లేదో తనిఖీ చేయడానికి సెర్చ్‌లైట్లతో ఆ ప్రాంగణాన్ని జల్లెడ పట్టింది. మంగళవారం తెల్లవారుజామున, కార్మికులు ఒక క్రేన్‌ను ఉపయోగించి, ప్రాంగణం మధ్యలో ఉన్న విగ్రహంపై కప్పి న ఒక భారీ ఫ్లోరోసెంట్ పసుపు రంగు చొ క్కాను తొలగించారు.

ఇది, 2018లో ప్రారంభమై అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మొదటి పదవీకాలాన్ని కుదిపేసిన ఇంధన ధరల నిరసనలకు సూచనగా ఉంది. ఆ త ర్వాత కార్మికులు ప్రెషర్ వాషర్లను ఉపయోగించి ఆ స్మారక చిహ్నంపై ఉన్న గ్రాఫిటీని తొలగించారు. ‘లక్షిత కర్ఫ్యూలు నిన్న రాత్రి ప్రశాంతతను కాపాడటానికి సహాయపడ్డాయి’ అని ప్రధానమంత్రి సెబాస్టియన్ లె కార్ను మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

దేశవ్యాప్తంగా చెలరేగిన ఈ అల్లర్లలో ఇప్పటివరకు 2,500 మందికి పైగా నిరసనకారు లను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. వచ్చే వారాంతంలో మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, భద్రతను మరింత కఠిన తరం చేయడానికి భారీగా పోలీసు బలగాలను, సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది.


మరిన్ని వార్తలు