పర్షియన్ గల్ఫ్‌లో చమురు ట్యాంకర్‌పై దాడి
పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఎంటీ ఫుజైరా ఎనర్జీ చమురు ట్యాంకర్‌పై (Oil Tanker Attack) ప్రొజెక్టైల్ దాడి జరిగింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న భారతీయ నావికుల్లో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు.
దాడి జరిగిన సమయంలో నౌకలో ఆరుగురు భారతీయ నావికులతో సహా మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక భారతీయ నావికుడికి స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది.దాడిలో గాయపడిన భారతీయ నావికుడిని అధికారులు సురక్షితంగా తీరానికి తరలించారు. అక్కడ తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. నావికుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతం అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇలాంటి ప్రాంతంలో చమురు ట్యాంకర్‌పై దాడి జరగడం నౌకాయాన భద్రతపై (Maritime Security) ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రయాణించే భారతీయ నావికుల భద్రతపై కూడా చర్చ మొదలైంది. ఈ ఘటనకు సంబంధించి దాడి వెనుక కారణాలు, బాధ్యుల వివరాలు ఇంకా స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తూ నావికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది (Indian Sailors).