మరో కంపెనీపై ఏఐ పడగ
- క్వాంటాస్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల కోత
- 850 మందిపై ఆస్ట్రేలియా సంస్థ వేటు
మెల్బోర్న్, నవంబర్ 10: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌ను(Global job market) వేగంగా దెబ్బతీస్తోంది. ఆస్ట్రేలియాకు చెంది న ప్రముఖ విమానయాన సంస్థ క్వాంటాస్ ఎయిర్‌వేస్(Qantas Airways) తాజాగా 850 మంది ఉద్యోగులకు పింక్ కార్డ్ ఇచ్చింది. 28 వేల మంది ఉద్యోగులను కలిగి ఉన్న క్వాంటాస్ ఎయిర్‌వేస్‌లో ఫైనాన్స్, కొనుగోళ్లు, మానవ వనరు లు, మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై వేటు వేసింది.
కొన్ని కార్పొరేట్ బాధ్యతలను ప్రముఖ అంతర్జాతీయ టెక్ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్‌కు ఔట్ సోర్సింగ్ రూపంలో అప్పగించడంతో ఉద్యోగాల్లో కోత ఏర్పడిం ది. ఏఐ వినియోగం పెరుగుతుండటంతో పాత సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించ డం, డేటా విశ్లేషణ, ఆటోమేషన్, డిజిటల్ సేవలను మెరుగు పరచడం వంటి లక్ష్యాల తో క్వాంటాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తె లిపింది.
రానున్న సంవత్సరాల్లో ఉద్యోగ కో తలు దశల వారీగా అమలవుతాయని, తొలి దశలో 2027 మధ్య నాటికి అమలు చేస్తామని ఉద్యోగులకు పంపిన ఈ క్వాంటాస్ సీఈవో వెనెస్సా హడ్సన్ తెలిపారు.
భారత్ ఐటీ నిపుణులకు భలే చాన్స్
క్వాంటాస్ ఎయిర్‌వేస్ తీసుకున్న నిర్ణయంలో భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. యాక్సెంచర్ సంస్థ భారత్‌లో ఉన్న ప్రత్యేక బృందాల ద్వారా క్వాంటాస్ కార్యకలాపాలను నిర్వహించనుంది. భారత్‌లో త క్కువ నిర్వహణ వ్యయంతో పాటు సాంకేతిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తక్కువ వేతనాలకే లభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
యాక్సెంచర్ భాగస్వామ్యంతో ప్రపంచవ్యా ప్తంగా అందుబాటులో ఉన్న డేటా, ఏఐ నై పుణ్యాలను ఉపయోగించుకోవచ్చని క్వాం టాస్ భావిస్తోంది. మొత్తానికి క్వాంటాస్ నిర్ణయంతో భారత్‌లోని ఐటీ నిపుణులు, ఫైనా న్స్ ఉద్యోగులు, హెచ్‌ఆర్ నిపుణులు, డేటా అనలిస్టులకు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే అవకాశం లభించ నుంది. మరోవైపు ఆస్ట్రేలియాలోని ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు. అయితే.. భారత్‌లో ఎన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయనే దానిపై స్పష్టత లేదు.
ఆస్ట్రేలియా ఉద్యోగ సంఘాల ఆగ్రహం
క్వాంటాస్ ఎయిర్‌వేస్ నిర్ణయంపై ఆస్ట్రేలియాలోని ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. యాక్సెంచర్‌తో భాగస్వామ్యం కారణంగా ఉద్యోగాల ను విదేశాలకు తరలించబోమని క్వాంటాస్ గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని ఆస్ట్రేలియన్ సర్వీసెస్ యూనియన్ అనే ఉద్యోగ సంఘం విమర్శించింది. తొలగించిన ఉద్యోగులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.