నాన్నను చంపేందుకే భద్రతను తగ్గించారు

25-11-2026 | 05:25am

రాజీవ్ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

న్యూఢిల్లీ, నవంబర్ 24: ‘మా నాన్న రాజీవ్ గాంధీని(Rajiv Gandhi) చంపేందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకే ఆయన భద్రతను(Security) తగ్గించారు. ఆయన హత్యకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు. దాన్ని నేను గుర్తించి అప్పుడే అమ్మకు చెప్పాను. దీనిపై నాన్నతో వాదించాను కూడా’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన ఆరోపణ చేశారు. సోనియా గాంధీ(Sonia Gandhi) ఆత్మకథ(Autobiography) ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలైన నేపథ్యంలో తమ కుటుంబ జీవితంలోని అత్యంత విషాదకర జ్ఞాపకాలను రాహుల్, ప్రియాంక, సోనియా ఒక వీడియో ద్వారా పంచుకున్నారు.

1991 మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎల్‌టీటీఈకి చెందిన మహిళా ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ 46 ఏళ్ల వయస్సులో మరణించిన విషయం తెలిసిందే. 1984 మధ్య భారత ఉన్నప్పుడు రాజీవ్‌కు ఎస్పీజీ రక్షణ(SPG protection) కల్పించారు. ఆయన ఓడిపోయిన తర్వాత 1989లో ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తగ్గించింది. 

1991లో ప్రతిపక్ష నేతగా రాజీవ్ గాంధీకి బీహార్ పర్యటనలో ఎదురైన చేదు సంఘటనను సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించిన రాజీవ్‌తో పాటు రాహుల్ కూడా ఉన్నారు. అప్పుడు రాజీవ్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన రాహుల్.. ‘నాన్న భద్రత విషయంలో మనం ఏదైనా చేయకుంటే చాలా త్వరలోనే ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నేను తిరిగి రావాల్సి వస్తుందని నాకు అనిపిస్తోంది’ అని రాహుల్ అప్పట్లోనే హెచ్చరించాడని సోనియా చెప్పారు.

మరిన్ని వార్తలు