చెన్నైకి రాహుల్.. నీట్‌పై ఏం తేల్చనున్నారు?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో నీట్ (NEET) అంశంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు సమాచారం.విద్యార్థుల భవిష్యత్తు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, సాయంత్రం విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, వారి సమస్యలపై ఆయన స్పందించనున్నారు.నీట్ అంశం నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన, సీఎం విజయ్‌తో భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది
Tamil Nadu CM Joseph Vijay and LoP Shri Rahul Gandhi had tea together at Bask by Coffee in Palavakkam. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు, ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు పలవాక్కంలోని బాస్క్ బై కాఫీ (Bask by Coffee)లో కలిసి టీ తాగారు. #RahulGandhi #ChhatronKiGoonj #Chennai
— Congress for Telangana (@Congress4TS) October 10, 2026