ఉక్రెయిన్‌పై రష్యా దాడి

20-10-2026 | 05:15am

28 సబ్‌స్టేషన్లు, ఇంధన కేంద్రాలు ధ్వంసం

నిలిచిన విద్యుత్, నీటి సరఫరా

కీవ్, అక్టోబర్ 19: బాలిస్టిక్ క్షిపణులు(Ballistic missiles), జెట్-పవర్డ్ డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్ విద్యుత్(Ukraine electricity), ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా కొత్త దాడులు చేసిందని అధ్యక్షుడు వోలోడిమిర్ జె లెన్‌స్కీ(Volodymyr Zelenskyy) సోమవా రం తెలిపారు. గతంలో తమ నిఘా సమాచారాన్ని పంచుకున్న భాగస్వామ్య దేశాల నుంచి ఈ దాడి గురించి  ఎటువంటి ముందస్తు హెచ్చరిక అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఓ యువతి మృతి చెందింది. రష్యా(Russia) రాత్రి పూట జరిపిన దాడిలో 28 సబ్‌స్టేషన్లు, ఇతర కీలక ఇంధన కేంద్రా లు దెబ్బతిన్నాయని, దీంతో ఐదు లక్షల మందికి పైగా ప్రజలకు విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయిందని జెలె న్‌స్కీ సోషల్ మీడియాలో(social media) తెలిపారు.

రష్యా కీవ్, దాని పరిసర ప్రాంతాలపై 16 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిం చిందని తెలిపారు. ఈ దాడిలో 21 ఏళ్ల మహిళ మరణించినట్లు రాజధానిలోని అధికారులు పేర్కొ న్నారు. ఒక డేటా సెంటర్, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల విడిభాగాలను నిల్వ చేసే ఒక లాజిస్టిక్స్ హబ్, డ్రోన్ విడిభాగాల ను తయారుచేసే ఒక పారిశ్రామిక కేంద్రం, క్షిపణులను నిల్వ ఉంచే ఒక లోకోమోటివ్ డిపోతో సహా ఉక్రెయిన్‌లోని లక్ష్యాలపై దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు