మేనరిక వివాహాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

21-11-2026 | 10:19am

మేనరిక వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కేంద్రానికి నోటీసులు!

న్యూఢిల్లీ: దగ్గరి బంధువుల మధ్య జరిగే మేనరిక వివాహాల అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా పెళ్లిళ్ల(Cousin Marriages) వల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? Genetic Disorders ముప్పును తగ్గించేందుకు ప్రత్యేక చట్టం అవసరమా? అనే ప్రశ్నలపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలకంగా స్పందించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది.

బెంగళూరుకు చెందిన లా విద్యార్థిని చార్వి ఎస్ దాఖలు చేసిన Petitionపై శుక్రవారం విచారణ జరిగింది. పిటిషనర్ స్వయంగా మేనరిక వివాహం ద్వారా జన్మించారని, 40 శాతం దృష్టి లోపంతో బాధపడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దగ్గరి బంధువుల మధ్య వివాహాల వల్ల పిల్లలకు నివారించగలిగే Genetic Health Problems వచ్చే ప్రమాదం ఉందని, ఈ అంశంపై ప్రజల్లో Awareness పెంచాలని ఆమె కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. సామాజిక సంస్కరణలకు సంబంధించిన కొత్త చట్టాలను రూపొందించడం పూర్తిగా Legislature పరిధిలోని అంశమని అభిప్రాయపడింది. Marriage అనేది వ్యక్తిగత ఎంపిక అయినప్పటికీ, దాని వల్ల ఎదురయ్యే ఆరోగ్యపరమైన పరిణామాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని పేర్కొంది. కేంద్రాన్ని ఆదేశించడం తమ ఉద్దేశం కాదని, ఈ అంశంపై ప్రభుత్వం సున్నితంగా స్పందించేలా చేయడమే లక్ష్యమని స్పష్టం చేసింది.

మేనరిక వివాహాల వల్ల పుట్టబోయే పిల్లల్లో Genetic Defects, పుట్టుకతో వచ్చే వైకల్యాలు, చూపు లేదా వినికిడి సమస్యలు, Infant Mortality వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అందుకే Hindu Marriage Actలో అవసరమైన Amendments చేయాలని, ఇలాంటి వివాహాలకు ముందు తప్పనిసరిగా Genetic Counselling, Medical Tests నిర్వహించేలా Guidelines రూపొందించాలని కోరారు.

అయితే, ఇప్పటికే జరిగిన మేనరిక వివాహాలను Criminal Offenceగా పరిగణించడం ఈ Petition ఉద్దేశం కాదని పిటిషనర్ స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా Preventive Measures తీసుకోవడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు కేంద్రం నుంచి Response మాత్రమే కోరింది. మేనరిక వివాహాలపై ఎలాంటి Ban విధించలేదు. కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి Hearing జరగనుంది.

మరిన్ని వార్తలు