రేవంత్‌రెడ్డి.. వన్ టైమ్ వండర్ లీడర్

21-11-2026 | 05:15am
  1. 2028 డిసెంబర్‌తో రాజకీయ ఏటీఎం గడువు ముగుస్తుంది
  2. ఢిల్లీకి సంచులు మోయడంలో సీఎంకు పదికి పది మార్కులు
  3. మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం.. తెలంగాణ బాద్‌షా కేసీఆర్
  4. ఓ టీవీ ఛానల్ సమ్మిట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్ అని, 2028 డిసెంబర్ నాటికి ఆయన రాజకీయ ఏటీఎం గడువు ముగుస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ న్యూస్ ఛానల్  సమ్మిట్‌లో కేటీఆర్ మాట్లాడారు. ‘ఢిల్లీకి సంచులు మోయడంలో, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంలో రేవంత్‌రెడ్డికి పదికి పది మార్కులు ఇవ్వొచ్చు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో మాత్రం ఎలాం టి మార్కులు ఇవ్వలేం. రాహుల్‌గాంధీకి రేవంత్‌రెడ్డి ఏటీఎంగా మారారు’ అని దుయ్యబట్టారు. ‘2015లో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వ డానికి ప్రయత్నించిన కేసులో ఫోరెన్సిక్, డాక్యు మెంటరీ ఆధారాలున్నాయి. ఆ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఎమ్మెల్యేకు సంచులు తీసుకెళ్లేస్థాయి నుంచి ఢిల్లీకి  మోసే స్థాయికి రేవంత్ ఎదిగారు’ అని ఆరోపించారు. రాహుల్‌గాంధీ కి రెండు ఏటీఎం కార్డులు ఉన్నాయని, ఒకటి రేవంత్‌రెడ్డి, మరొకటి డీకే శివకుమార్ అని ఆయన దుయ్యబట్టారు.  

ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పు డు ప్రతిపక్ష నాయకులను తిట్టడం, కొత్త కేసులు పెట్టడం, కొత్త కమిషన్లు ఏర్పా టు చేయడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్లను, మహిళలను, ఉద్యోగులను అడిగితే ప్రభుత్వం గురించి తెలుస్తుందన్నారు. కరువు పరిస్థితులు ప్రభు త్వ వైఫల్యమని, ఇది ఎల్‌నినో కాదని, ఎల్ కాంగో ప్రభావం అంటూ విమర్శించారు. 

బ్లాక్ మెయిలింగ్‌కే హైడ్రా

బ్లాక్ మెయిలింగ్, వసూళ్లకు హైడ్రా ఉపయోగపడుతున్నదని.. పేదల గుడిసెలను కూల్చివేస్తూ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉపాధి లేని కాంగ్రెస్ నాయకులను ఒకచోట చేర్చి, రాహుల్‌గాంధీని ప్రమోట్ చేసుకోవడం, కాంగ్రెస్‌కు ప్రచారం చేసుకోవడమే భారత్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశంగా కనిపించిందని, తెలంగాణకు ఏం ప్రయోజనం కలిగింది?’ అని ప్రశ్నించారు.

‘ప్రధాని మోదీ ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, ౨ కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.. రేవంత్ కూడా రైతులకు రూ.15 వేల ఆర్థిక సాయం,  మొద టి ఏడాదిలోనే ౨ లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇద్దరూ తమ హామీలను నెరవేర్చలేదు. పెద్ద మోదీ అయినా చిన్న మోదీ అయినా హామీ ల అమలులో ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల గుం డెల్లో కేసీఆర్ చిరస్థాయిగా ఉంటారని, తెలంగాణకు బాద్‌షా కేసీఆర్ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు