జేమీసన్ మ్యాజిక్.. పడ్డికల్ ఔట్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో(India vs New Zealand 1st Test 2026) టీమిండియా పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. మూడో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి భారత్ 90.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఆధిక్యాన్ని తగ్గిస్తూ బ్యాటింగ్‌లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం భారత్ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 33 పరుగులు వెనుకబడి ఉంది.
ఓపెనర్ కేఎల్ రాహుల్(kl rahul) అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీని దాటి 120 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(shubman gill) 31 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. అంతకుముందు దేవదత్ పడిక్కల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 175 బంతుల్లో 80 పరుగులు చేసిన అతడు, రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే, న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్(New Zealand pacer Kyle Jamieson) అద్భుతమైన బంతితో ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. 83వ ఓవర్లో మంచి Length Deliveryతో పడిక్కల్‌ను బోల్తా కొట్టించాడు. బంతి స్వల్పంగా దిశ మార్చుకోవడంతో బ్యాట్‌ను దాటుకుని నేరుగా ఆఫ్ స్టంప్‌ను తాకింది. దీంతో పడిక్కల్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. భారత్ 295 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాహుల్, గిల్ క్రీజులో ఉండటంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది.