ఏసీబీకి చిక్కిన వార్డు ఆఫీసర్
ఎల్లంపేటలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవీందర్‌రెడ్డి
మేడ్చల్ అర్బన్, నవంబర్ 20 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో రూ.30 వేల లంచం తీసుకుంటూ రావల్‌కోల్ వార్డు ఆఫీసర్ రవీందర్‌రెడ్డి(Ward Officer Ravinder Reddy) శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. రావల్ కోల్‌లో రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన అసెస్మెంట్ పనికి రవీందర్‌రెడ్డి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు వార్డు శుక్రవా రం రవీందర్‌రెడ్డికి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్ ఆఫీసు తలుపులు వేసి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.