‘భారత్‌ను చూసి నేర్చుకోండి’

21-11-2026 | 08:21am

భారత్‌పై ట్రంప్ ప్రశంసలు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై తీవ్ర విమర్శలు

వాషింగ్టన్: భారత్ ఆర్థిక విధానాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరోసారి ప్రశంసించారు. ముఖ్యంగా తక్కువ వడ్డీ రేట్లతోనే(India Low Interest Rates) భారత్ సుమారు 7 శాతం GDP Growth సాధిస్తోందని ప్రస్తావించారు. అమెరికాలోనూ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆర్థిక వృద్ధి మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమెరికా కేంద్ర బ్యాంకు Federal Reserveపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆసియా పర్యటన ముగించుకుని వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో వడ్డీ రేట్లు(America Interest rates) అధికంగా ఉండటానికి ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ వడ్డీ రేట్లు పెంచడం తనకు అర్థం కావడం లేదన్నారు. మంచి Economic Data వచ్చినప్పుడు రేట్లు తగ్గించాల్సింది పోయి పెంచుతున్నారని విమర్శించారు. ఫెడ్ నిర్ణయాల్లో రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. మాజీ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అలన్ గ్రీన్‌స్పాన్‌ను ఈ సందర్భంగా ట్రంప్ గుర్తుచేశారు. ఆయన హయాంలో ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉన్నప్పుడు వడ్డీ రేట్లను తగ్గించేవారని చెప్పారు. ప్రస్తుతం అమెరికా అనుసరిస్తున్న విధానం అందుకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పుడు రుణాలపై వడ్డీ భారం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తే GDP Growth 4 శాతం దగ్గర ఆగకుండా 15 నుంచి 20 శాతం వరకు చేరుకునే అవకాశం ఉండేదని ట్రంప్(Trump) అంచనా వేశారు. అంతేకాకుండా దేశ అప్పులను కూడా వేగంగా చెల్లించగలిగేవాడినని వ్యాఖ్యానించారు. భారత్‌లో తక్కువ వడ్డీ రేట్లతో 7 శాతం వృద్ధి నమోదవుతోందని ప్రస్తావిస్తూ.. అమెరికా కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సూచించారు. అయితే 15–20 శాతం వృద్ధి సాధ్యమనే ట్రంప్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అంచనాలు మాత్రమే; అవి నిర్ధారిత ఆర్థిక అంచనాలు కావు.


మరిన్ని వార్తలు