సింధు ఆస్పత్రిలో వరల్డ్ క్వాలిటీ డే
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): సింధు హాస్పిటల్(Sindhu Hospital)లో వరల్డ్ క్వాలిటీ డే 2026 వేడుకలను క్వాలిటీ పవరింగ్ పెర్ఫార్మెన్స్ అనే థీమ్‌తో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సాధించిన ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్, ఎన్ఏబీఎల్ సర్టిఫికేషన్, నర్సింగ్ ఎక్సలెన్స్ విజయాలను గుర్తుచేసుకున్నారు. ముఖ్య అతిథి, రాజ్యసభ సభ్యుడు, సింధు హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ బి. పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యత అనేది కేవలం సర్టిఫికేషన్లకే పరిమితం కాకుండా ప్రతి రోగికి అందించే వైద్యసేవల్లో ప్రతిబింబించాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ బి. సోమరాజు, డాక్టర్ ఎం. బాబయ్య, డాక్టర్ కె.వి.వి.ఎన్. రాజు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఆంటోనీ లాజర్ బాసిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాలిటీ ఆంథమ్, పేషెంట్ జర్నీ వీడియోను ఆవిష్కరించడంతో పాటు ఆసుపత్రి తొలి క్వాలిటీ న్యూస్లెటర్ను విడుదల చేశారు. నాణ్యమైన వైద్యసేవల్లో విశేష కృషి చేసిన వివిధ విభాగాల ఉద్యోగులు, బృందాలకు అవార్డులు అందించి సత్కరించారు.