ప్రపంచ తెలుగు మహా సభల తేదీల మార్పు
డిసెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహణ : డా.గజల్ శ్రీనివాస్
ఒంగోలు, అక్టోబర్ 19(విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్(Andhra Saraswata Parishat) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించను న్న నాలుగవ ప్రపం చ తెలుగు మహాసభలు (బాలల) నిర్వ హణ తేదీలను మార్చినట్లు పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్(Ghazal Srinivas) ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెకస్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్(Next Gen International School) ప్రాం గణంలో నిర్వహించనున్న ఈ మహాసభలను తొలుత డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించా లని నిర్ణయించగా, స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నేపథ్యంలోనూ, పలు ప్రవాస తెలుగు సంఘాల(Telugu diaspora organizations) ప్రత్యేక అభ్యర్థనల మేరకు 2026 డిసెంబర్ 19, 20 తేదీలకు మార్చినట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు బా లబాలికల్లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.