అనారోగ్య బాధితురాలికి రూ.3 లక్షల ఎల్‌ఓసీ
16-07-2026 12:53 AM
- నిమ్స్లో చికిత్సకు చర్యలు
- విప్ ఆది శ్రీనివాస్ సత్వర స్పందన
వేములవాడ, జూలై 15, (విజయ క్రాంతి): వేములవాడ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కూరగాయల అనిత అనా రోగ్యంతో అత్యవసర చికిత్స అవసరమని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెంటనే స్పం దించారు.
నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మా ట్లాడి ఆమెకు ప్రత్యేక చికిత్స అందేలా చర్య లు తీసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చే యించారు. ప్రభుత్వ సాయం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు ఆయన తక్షణ స్పందనను అభినందించారు.






