16 July, 2026 | 12:37 AM

ఉన్నత శిఖరాలపై ఉత్తరప్రదేశ్!

16-07-2026 12:33 AM
  1. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యమైన అభివృద్ధి
  2. రూ. 9 లక్షల కోట్లకు పెరిగిన యూపీ బడ్జెట్
  3. లక్నో కాన్‌క్లేవ్‌లో సీఎం యోగి ఆదిత్యానాథ్

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. లక్నోలో జరిగిన ఒక కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన ఉత్తరప్రదేశ్ ఉన్నత శిఖరాలకు చేరుకున్న వైనాన్ని వివరించారు. తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లకు పైగా పరిపాలించే అవకాశం దక్కిందన్నారు. ఇదంతా కేవలం డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యమైందని వివరించారు.

గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మూడు రెట్లు పెంచడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ సగర్వంగా పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో మహిళా వర్క్‌ఫోర్స్ ఉనికిని మూడు రెట్లు పెంచామనికూడా ఆ యన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జరిగిన పారిశ్రామికీకరణ కారణంగా మహిళల భాగస్వామ్యం పెరిగిందని ఆయన వివరించారు. 2017లో రాష్ట్రంలో డబుల్ ఇం జన్ సర్కారు ఏర్పడినప్పటికే.. యూపీలోని ఒక జిల్లా నుంచి ఎంపీగా పార్లమెంట్‌లో పనిచేసే అవకాశం లభించిందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక అయోమయ పరిస్థితి ఉండేదన్నారు. 

శాంతి భద్రతలు..

2017కు ముందు యూపీలో ప్రతి మూ డో రోజు ఒక అల్లరి జరిగేది. నెలల తరబడి కర్ఫ్యూ ఉండేది. ఉత్తరప్రదేశ్‌లో ఆడబిడ్డలకు భద్రత లేదు. వ్యాపారులకు భద్రత లేదు. యూపీలో అలాంటి జిల్లాలు 35కుపైగా ఉండేవి. దేశంలో ఎక్కడ పేలుడు జరిగినా.. యూపీ పేరు వినిపించేది. దాని మూల్యం ఇక్కడి యువత చెల్లించాల్సి వచ్చేది. అయితేగడిచిన తొమ్మిది ఏండ్లలో... అల్లర్లు లేని, కర్ఫ్యూలేని, అశాంతిలేని రాష్ట్రంగా యూపీ ఒక కొత్త గుర్తింపును నిర్మించుకుందని సీఎం పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ఆడబిడ్డలు సురక్షితం. వ్యాపారికూడా సురక్షితం. ఈ భద్రతా వాతావరణ లేకపోతే.. ఎవరైనా మన దగ్గరకు పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారా. ఊహించండి. మొట్టమొదటి ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించే సమయంలో.. మా పారిశ్రామిక అభివృద్ధి మంత్రి, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి కమిషనర్ నా దగ్గరకు వచ్చి.. సర్.. ఎన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించాల.. టార్గెట్ రూ. 20 వేల కోట్లు అని చెప్పారు. ఈ సమ్మిట్ పేరు ఏంటని నేను అడిగాను. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని వారుచెప్పారు.

కానీ నేను దాని పేరు మార్చమని చెప్పాను. రూ. 20 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుని.. దాన్ని గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు. గ్లోబల్ అంటే.. పెట్టుబడికూ డా అదే స్థాయిలో ఉండాలని చెప్పాను. కానీ యూపీలో ఎవరు పెట్టుబడి పెడతారు సార్ అంటూ వారు అన్నారు. పాలసీ రూపొందించండి.

ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయండి. రోడ్‌షోలు నిర్వహించండి. ఒకట్రెండు చోట్ల కు నేనుకూడా వస్తాను. కానీ టార్గెట్ పెద్దగా ఉండాలి. కనీసం రూ. 2 లక్షల కోట్లు ఉండాలని చెప్పాను. దానికి వారు ఆశ్చర్య పోయా రు. కానీ.. ఇప్పుడు.. ఈ సమయంలో యూపీలో పెట్టుబడుల కసం రూ. 50 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. దాదాపు 65 లక్షల యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని, ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడు ల్లో రూ. 15 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి ప్రతిపాదనలనకు గ్రౌండ్ బ్రేకింగ్ నిర్వహించామని సీఎం యోగి వివరించారు. 

2017కు ముందు లక్నో చికన్‌కారీ పరిశ్రమ, ఫిరోజాబాద్ గాజు పరిశ్రమ, మురాదాబాద్ బ్రాస్ పరిశ్రమ, మీరట్ క్రీడా సామాగ్రి తయారీ పరిశ్రమ, బదోహి కార్పెట్ పరిశ్రమ, వారణాసి చీరల పరిశ్రమలు శిథిలావస్థకు చేరు కున్నాయి. ఇక్కడి వ్యాపారి.. కూలీగా మార డం తప్ప మరో మార్గం లేకుండా పోయిం ది. ఇప్పుడు 75 జిల్లాల్లో యూపీకి చెందిన 79 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌తో అనుసంధానించాం.  ప్రస్తుతం 96 లక్షల ఎంఎస్‌ఎంఈలు వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడక్ట్ కింద యూపీలో పనిచేస్తున్నాయి. రూ.లక్ష కోట్ల విలువైన వస్తు వులు, ఉత్పత్తులను ఎంఎస్‌ఎంఈలు ఎగుమతి చేస్తున్నాయి అని చెప్పారు. 

భారత దేశంలోనే అత్యత సారవంతమైన భూములు యూపీలో ఉన్నాయి. కానీ 2014కు ముందు.. రైతుకు ఎలాంటి సౌకర్యాలు లభించేవి కాదు. అప్పు ల భారంలో కూరుకుపోయారు. విత్తనాలు లేవు. ఎరువులు లేవు. విద్యుత్తు లేదు. పొలానికి వెళ్ళలేడు. అతని ఉత్పత్తులకు కేంద్రం లేదు. రైతుకు ఎలాంటి సౌకర్యం లేదు. ఆత్మహత్యనే శరణ్యం అనేలా పరిస్థితి ఉండేది. ఆత్మహత్యలు జరగేవి. 2007 నుంచి 2017 వరకు.. పది సంవత్సరాల్లో యూపీలో మొ త్తం 29 చక్కెర మిల్లులు మూతపడ్డాయి..

లేదా అమ్ముకోవాల్సి వచ్చింది. 21 చక్కెర మిల్లులను అతి కత్కు వ ధరలకే అమ్మేశారు. చక్కెర మిల్లును రూ. 3 కోట్లకు అమ్ముకున్నారనేది ఎవరైనా ఊహించగలరా? వాటి భూ ముల విలువనే వందల కోట్ల రూపాయలు ఉంటుంది. వాటిని రూ. 3 కోట్లకు అమ్ముకున్నారు. కానీ 2017 నుంచి ఇప్పటి వరకు రూ. 3.23 లక్షల కోట్లను నేరుగా చెరుక రైతుల ఖాతాల్లో వేశాం. ఈరోజు 122 చక్కెర మిల్లులను మేము నడిపిస్తున్నాం. సంక్షేమ పథకాల్లో భాగంగా 16 కోట్ల పేద కుటుంబాలకు ఉచిత రేషన్ ఇస్తున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

గణనీయమైన ఆర్థిక ప్రగతి 

తాము ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పుడు.. యూపీ మొత్తం బడ్జెట్ రూ. మూడు లక్షల కోట్లు. ఈ సంవత్సరం మేము ప్రవేశపెట్టిన యూపీ వార్షిక బడ్జె ట్ రూ.9 లక్షల కోట్లు అని సీఎం తెలిపారు. 2016 యూపీ మొత్తం జీఎ స్‌డీపీ రూ.12 లక్షల కోట్లు.. ఇప్పుడు అదికాస్తా రూ.36 లక్షల కోట్లు అని పేర్కొ న్నారు. 2016 యూపీ తలసరి ఆదాయం రూ.43వేలు మాత్రమే.. ఇప్పు డు అది రూ.1,20వేలు దాటింది. యూ పీలో అప్పట్లో పనిచేసే మహిళల శాతం (మహిళా ఫోర్స్) 12 శాతం మాత్రమే.

అది ఈరోజు 37 శాతానికిపైగా ఉం ది. 2016 యూపీ లో నిరుద్యోగ నిష్పత్తి 19 శాతం ఉండగా.. అది ఈరోజు 3 శాతంకంటే దిగువకు వచ్చింది. ఇదే కొత్త యూపీ. దీనినే ఇప్పుడు ‘ఉన్నత శిఖరాలపై యూపీ’ పేరుతో ఈ కాన్‌క్లేవ్ ద్వారా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రోడ్లలో అత్యుత్తమ నెట్‌వర్క్, ఎక్స్‌ప్రెస్ వేలలో దేశంలోని మొ త్తం వాటాలో 60 శాతం ఒక్క యూపీలోనే ఉందన్నారు. ఇంటర్‌స్టేట్ కనెక్టివిటీ అయినా.. జిల్లా ప్రధాన కార్యాలయాలు అయినా.. ఇవన్నీ ఫోర్‌లేన్ కనెక్టివిటీతో అనుసంధానించామన్నారు.

దేశంలో మొ దటి ఇన్‌ల్యాండ్ వాటర్‌వే, మొదటి ర్యాపిడ్ రైలు యూపీలో ఉన్నాయి. దేశంలో ఏదైనా మొదటి నగరం (సిటీ) రోప్‌వేతో అనుసంధానిస్తు న్నారా అంటే.. అది వారణాసి. దేశంలోనే మొదటిసారి గా రోప్‌వే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం వారణాసిలో ప్రారంభించనున్నాం. అత్యధిక విమానాశ్రయాలు యూపీలో ఉన్నా యి. దేశంలో అత్యధిక నగరాల్లో మెట్రో నడుస్తున్న రాష్ట్రం కూడా యూపీనే. మొ త్తం ఏడు నగరాల్లో మెట్రో సేవలు అందిస్తున్నాం. రైల్వేలోకూడా అతిపెద్ద నెట్‌వర్క్ యూపీ దగ్గరే ఉంది. ఇది రాష్ట్ర భవిష్యత్తును, దేశ భవిష్యత్తును, దేశ ఆర్థిక వ్యవ స్థను నిర్ణయించడంలో పెద్ద పాత్ర పోషిస్తోందని సీఎం యోగి వివరించారు.