14 July, 2026 | 12:39 PM

కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్

14-07-2026 11:34 AM

రూ.1.50 లక్షల గంజాయి స్వాధీనం

కల్లూరు,జూలై 14(విజయక్రాంతి): అక్రమ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి (విలువ రూ.1.50 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ హబీబ్, బొడ్డు చందు, తేజావత్ రమేష్‌లు ఒడిశా మల్కనగిరి నుంచి గంజాయి తెచ్చి విక్రయానికి సిద్ధమవుతుండగా, జూలై 13న షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు. ముగ్గురు నిందితులను సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి కొనుగోలు, రవాణా, విక్రయం నేరమని హెచ్చరించారు. ఎస్‌ఐ హరిత, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహారావు, లక్ష్మీపతి, కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, సత్యనారాయణ,రఫీ,విజయ్, రంగారావు తదితరులు కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.