14 July, 2026 | 12:52 PM

లులు మాల్‌లో గన్ కలకలం

14-07-2026 11:47 AM

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ (Kukatpally Housing Board Colony)లోని లులు మాల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మాల్ పార్కింగ్ స్థలంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు భయపడ్డారు. ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇరు వర్గాలను విచారిస్తుండగా, పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ జేబులో పోలీసులు ఆ ఆయుధాన్ని గుర్తించారు. పోలీసులు ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా, దానికి సరైన లైసెన్స్ ఉన్నట్లు తేలింది. తుపాకీతో ఉన్న వ్యక్తిని మాల్‌లోకి అనుమతించేటప్పుడు భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించలేదని పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యం వహించినందుకు గాను లూలూ మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.