తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్ TVKకి మద్దతు
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. టీవీకే విజయ్(TVK Vijay) ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వేలుమణి, షణ్ముగం వర్గం ప్రకటించాయి. షణ్ముగం మాట్లాడుతూ... తమిళనాడు ప్రజలు విజయ్ సీఎంగా ఉండాలని తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నాడీఎంకే నేత షణ్ముగం వెల్లడించారు. విజయ్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
అన్నాడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చిందని షణ్ముగం సూచించారు. DMK మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పార్టీ సభ్యులలో అత్యధికులు తిరస్కరించారని షణ్ముగం తెలిపారు. పొత్తు ప్రతిపాదనను శాసనసభాపక్ష సమావేశంలో వ్యతిరేకించినట్లు షణ్ముగం స్పష్టం చేశారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టిందే అన్నాడీఎంకే పార్టీ అన్నారు. పొత్తు పెట్టుకుంటే భవిష్యత్ లో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని వద్దన్నట్లు తెలిపారు. డీఎంకేతో పొత్తు వద్దని శాసనసభాపక్ష సమావేశంలోనే తీర్మానం చేశామన్నారు. మా నిర్ణయం వల్ల అన్నాడీఎంకే చీలిక వచ్చినట్లు కాదని, పార్టీ ప్రధాన కార్యదర్శి నిర్ణయం కోసం ఎదురుచూస్తామని వేలుమని వెల్లడించారు.
తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న తాజా పరిణామాలు తెలుసుకోవాలంటే మా విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.
అన్నాడీఎంకేలో చీలిక.. పళనిస్వామికి షాక్.. విజయ్‌కు రెబెల్ ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకేలో పార్టీలో చీలిక ఏర్పడింది. పళనిస్వామికి వ్యతిరేకంగా షణ్ముగం గళమెత్తారు. వేలుమణి 24 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక వర్గం ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి మద్దతు తెలపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో బుధవారం బలనిరూపణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అన్నాడీఎంకే అధ్యక్ష, జనరల్ సెక్రటరీ పదవులకు కూడా రాజీనామా చేయాలని చీలిక వర్గం డిమాండ్ చేస్తోంది.
ఇలాంటి రాజకీయ పరిణామాలపై మరిన్ని విశ్లేషణల కోసం మా Politics Section VijayaKranthi పేజీని చూడండి.
మంగళవారం నాడు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అన్నాడీఎంకే రెబల్ గ్రూప్ స్పీకర్‌ను కలిసి విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించనున్నాయి. ఇప్పటికే AIADMK నాయకుడు సి.వి. షణ్ముగం తమిళనాడు శాసనసభకు చేరుకున్నారు. విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వానికి AIADMK(All India Anna Dravida Munnetra Kazhagam) మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. అలాగే, శాసనసభాపక్ష సభ్యులలో అత్యధికులు ఎస్.పి. వేలుమణిని AIADMK శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.






