2 May, 2026 | 1:52 AM

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి శుభలేఖ అందజేత

02-05-2026 12:00 AM

మెదక్, మే 1 (విజయక్రాంతి): హవేలిఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కొండయ్య గారి నారా గౌడ్ కుమార్తె వివాహం ఈనెల 6న జరగనుంది. ఈ వివాహం హవెలిఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిమ్మాయిపల్లి గ్రామ అధ్యక్షులు సూడ ప్రసాద్, మాజీ వార్డు సభ్యులు లింగంతో కలిసి నారగౌడ్ హైదరాబాదులోని కొంపల్లిలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డిని వారి నివాసంలో కలసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తమ కుమార్తె వివాహానికి విచ్చేసి ఆశీర్వదించాలని నారా గౌడ్ కోరారు.