19 April, 2026 | 1:49 AM

డీఎంకే కూటమిదే అధికారం

19-04-2026 12:00 AM
  1. లౌకికవాదం కోసం తమిళ ప్రజలు ముందుంటారు
  2. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ నాయకత్వంలోని కూటమి తమిళనాడు లో తిరిగి మంచి మెజారిటీతో అధికారం లోకి రాబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం ఆయ న తమిళనాడులోని రాణిపేట జిల్లా పండియానల్లుర్‌లో ఏర్పాటుచేసిన రాహుల్‌గాంధీ సభలో పాల్గొన్నారు. అంతకుముందు రాణిపేట జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ప్రసంగించారు.

లౌకిక వాదాన్ని బలోపేతం చేయడంలో, సంరక్షిం చడంలో తమిళనాడు ప్రజలు ముందుంటారని తెలిపా రు. వీరగడ్డకు, ఆత్మగౌరవానికి తమిళనాడు మా రుపేరు అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తపిం చే ఒక సామాన్య కార్యకర్తగా మీ అందరి ముందుకు వచ్చానని తెలిపారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదని, అదొక సిద్ధాంతమని, పెరియార్, అన్నాదురై, కలైంజర్ కరుణానిధి వంటి గొప్ప నేతలు ఇక్కడ సామాజిక న్యాయానికి పునాది వేశారని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పీఠంపై కూర్చున్న పెద్దలు తమిళనాడు సంస్కృతిని, భాషను, హక్కులను కాల రాయాలని చూ స్తున్నారని, వారిని ఎదుర్కోవాలంటే సెక్యులర్ శక్తుల ఐక్యత అవసరమన్నారు. సీఎం ఏంకే స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి పథంలో దూసుకుపో తున్నదని, రాహుల్‌గాంధీ ప్రేమ సందే శం స్టాలిన్ అభివృద్ధి నినాదం ఒకటయ్యాయని, డీఎంకే కూటమి గెలుపు కేవలం తమిళనాడుకే కాదు దేశానికి దిక్సూచిగా మారబోతుందని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూ నిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, రెండు లక్షల వరకు ఒకేసారి రైతులకు రుణమాఫీ, తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం వంటి హామీలను అమ లు చేసి చూపించామని వివరించారు. ఈ ఎన్నికల్లో కాం గ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.