18 April, 2026 | 2:20 AM

సందేశమిచ్చే ఓ అందాల రాక్షసి

18-04-2026 12:00 AM

సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న షెరాజ్ మెహదీ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. ఇదుంలో విహాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశ్‌పాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, నేహా దేశ్‌పాండే, అనంత్ బాబు, ప్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హీరో షెరాజ్ మెహదీ సంగీతాన్ని కూడా అందించడం విశేషం.

స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించారు. ఈ చిత్రం కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ మంచి ఆదరణ పొందింది. తెలుగులోనూ గతంలో విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీమియర్ షో ఏర్పాటుచేసింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. “అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ఎంచుకున్నా.

ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించ డంతోపాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా ఇస్తున్నాం. గతంలో ఈ సినిమాను మిస్ అయినవాళ్ల కోసం రీ-రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.