27 August, 2026 | 3:16 PM

మాజీ సర్పంచ్ సత్తన్నకు మాజీ ఎంపీ కవిత పరామర్శ

27-08-2026 01:06 PM

హనుమకొండ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు,  కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామ మాజీ సర్పంచ్ మదారపు సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ హన్మకొండ నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుని వారిని పరామర్శించి మనోదైర్యాన్ని కల్పించారు. ఎంపీ వెంట మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు నవీన్ రావ్, మహబూబ్ పాషా ఉన్నారు.