‘తస్సాదియ్యా’తో సమంత హంగామా
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా దర్శకురాలు నం దినీరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో దిగ్‌నాథ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు. శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష ముఖ్యపాత్రల్లో కనిపించనున్నా రు. వేసవి కానుకగా మే 15న విడుదల కానున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది.
ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మా Entertainment సెక్షన్ ఫాలో అవ్వండి
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ను మేకర్స్ విడుదల చేశారు. ‘త త్త త్త తస్సదియ్యా తగ్గేదేలేదు హొయ్యా.. అమ్మాయి అన్నాక ఆమాత్రం ఉండాలే..’ అంటూ సాగుతోందీ గీతం. సంతోష్ నారాయణన్ బాణీ కట్టిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్; కెమెరా: ఓం ప్రకాశ్; యాక్షన్: లీ విఠేకర్, ఏజాజ్ గులాబ్; ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల; ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్; నిర్మాతలు: సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్; స్టోరీ, స్క్రీన్‌ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్; దర్శకత్వం: నందినీరెడ్డి.
తాజా టాలీవుడ్ వార్తల కోసం మా హోమ్‌పేజీని సందర్శించండి
FAQ's:
1. Maa Inti Bangaram movie release date ఎప్పుడు?
‘మా ఇంటి బంగారం’ సినిమా మే 15, 2026న విడుదల కానుంది.
2. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?
ఈ సినిమాలో Samantha Ruth Prabhu ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
3. Maa Inti Bangaram movie director ఎవరు?
ఈ చిత్రాన్ని Nandini Reddy దర్శకత్వం వహించారు.
4. Tassadiyya song ఎవరు పాడారు?
‘తస్సాదియ్యా’ పాటను చిన్మయి శ్రీపాద మరియు పుణ్య సెల్వ ఆలపించారు.
5. Maa Inti Bangaram movie genre ఏమిటి?
ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది.
6. ఈ సినిమా నిర్మాతలు ఎవరు?
సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
7. ఈ సినిమాలో మరెవరు నటిస్తున్నారు?
గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
8. Maa Inti Bangaram teaser ఎలా ఉంది?
ఈ మూవీ టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుని అంచనాలు పెంచింది.
9. ఈ సినిమాకు సంగీతం ఎవరు అందించారు?
సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
10. Samantha upcoming movies ఏమిటి?
సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు, అందులో ‘మా ఇంటి బంగారం’ ప్రధానమైనది.
ఇవి కూడా చదవండి:
మా ఇంటి బంగారం వచ్చేది అప్పుడే
రెండు భిన్న కోణాల మా ఇంటి బంగారం
అక్కినేని సినిమాకు సమంత బెస్ట్ విష్‌స్!
జూబ్లీహిల్స్ లో హీరోయిన సమంత సందడి






