పరిసరాల పరిశుభ్రతతో మెరుగైన సమాజం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 6 (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతో మె రుగైన సమాజం ఏర్పడుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డులో నిర్వహించిన ప్రజాపా లన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చే యాలని ఆయన సూచించారు.ప్రభుత్వ కా ర్యాలయాలు, డ్రైనేజీలు, కాలనీలు, ఇళ్ల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. గ్రామాలు, పట్టణా ల్లో విద్యుత్ సౌకర్యాలు, డ్రైనేజీ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, మిడిల్ పోల్స్ అవసరం వంటి సమస్యలను గుర్తించి పరిష్క రించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
అలాగే విద్యార్థుల విద్య, హాస్టల్ సౌకర్యాలు మరియు ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముం దుగానే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని శాఖల అ ధికారులు పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూ చించారు.ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ వార్డులు, గ్రామాల అభివృద్ధికి భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




