8 March, 2026 | 8:08 AM

జై రాజ్ ఇస్పత్ లిమిటెడ్ విప్లవాత్మక మార్పు

07-03-2026 12:25 AM

అటూట్ ఎఫ్‌ఇ 550 డీ-గ్రేడ్ టీఎంటీ బార్ల విడుదల

హైదరాబాద్, మార్చి౬(విజయక్రాంతి): అధిక నాణ్యత గల టీఎంటీ బార్లు, స్ట్రక్చరల్ స్టీల్ ఉత్పత్తులకు పేరుగాంచిన దక్షిణ భారతదేశపు ప్రముఖ ఉక్కు తయారీ సంస్థల్లో ఒకటైన జై రాజ్ ఇస్పత్ లిమిటెడ్, శుక్రవారం తన ఫ్లాగ్షిప్ ఉత్పత్తి ‘జై రాజ్ అటూట్ ఎఫ్‌ఇ 550డీ టీఎంటీ’ బార్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆధునిక ఆకాశహర్మ్యాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పెరుగుతున్న డిమాండ్లను తీర్చడంతో పాటు, వ్యక్తిగత గృహ నిర్మాణదారులకు అత్యుత్తమ నాణ్యతను అందించడానికి రూపొందించబడిన ‘అటూట్’, నిర్మాణ సమగ్రత, భూకంప భద్రతలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది.

కర్నూలులోని జై రాజ్ ఇస్పత్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లో రెండవ ప్రైమరీ స్టీల్ ఉత్పత్తిదారు, భారతదేశంలోనే అధునాతన ఉక్కు తయారీ ప్రక్రియను అవలంబిస్తున్న అతికొద్ది ప్రైమరీ స్టీల్ ప్లాంట్లలో ఒకటి. ఈ ప్లాంట్ ఏడాదికి 0.50 మిలియన్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. యాజమాన్యం ఈ సామర్థ్యాన్ని 2026-27 నాటికి రెట్టింపు చేయాలని యోచిస్తోంది. ఈ సదుపాయం బ్లాస్ట్ ఫర్నేస్ ఎనర్జీ ఆప్టిమైజింగ్ ఫర్నేస్, లాడిల్ రిఫైనింగ్ ఫర్నేస్, ఎండ్లెస్ కాస్టింగ్ వంటి ప్రపంచ స్థాయి ప్రక్రియల ద్వారా, స్వచ్ఛమైన ఐరన్ ఓర్ (ఇనుప ధాతువు), కోక్‌ను ప్రాథమిక ముడి పదార్థాలుగా ఉపయోగించి ఉక్కును తయారు చేస్తుంది.

ఇది కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్లలో జై రాజ్ స్టీల్ వార్షిక ఆదాయాన్ని కనీసం రూ.5,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటూట్ ఆంధ్ర ఉత్పత్తి లాంచ్ ఈవెంట్, జై రాజ్ అటూట్ ఎఫ్‌ఇ 550డీ టీఎంటీ బార్ల అధికారిక లాంచ్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేసింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న అధీకృత డిస్ట్రిబ్యూటర్లు,ప్రముఖ డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై రాజ్ ఇస్పత్ లిమిటెడ్ ప్లాంట్ సందర్శన ద్వారా అధునాతన ఎనర్జీ ఆప్టిమైజింగ్ ఫర్నేస్, ఇటాలియన్ ఈసీఆర్ సాంకేతికతతో సాధించిన ఉత్పత్తి అత్యున్నత నాణ్యతను ప్రదర్శించింది.

సాయంత్రం జరిగిన సమావేశంలో జై రాజ్ అటూట్ ఎఫ్‌ఇ 550 డీ టీఎంటీ బార్ల అధికారిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా జై రాజ్ ఇస్పత్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌కే గోయెంకా మాట్లాడుతూ ‘మా కస్టమర్లకు అత్యున్నత గ్రేడ్ నాణ్యత కలిగిన, పర్యావరణ అనుకూలమైన రీబార్లను అందించడమే మా లక్ష్యం. కొత్త తరం స్టీల్ రీబార్ అయిన జై రాజ్ అటూట్ ఎఫ్‌ఇ 550 డీ టీఎంటీ బార్ల విడుదల, వినియోగదారులుసమాచారంతో కూడిన ఎంపికలను చేసుకోవడంలో సహాయపడటంపై దృష్టి సారించిన కంపెనీ పోర్ట్ఫోలియో-బిల్డింగ్ ప్లాన్‌లో భాగం. జై రాజ్ ఇస్పత్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశ్రీ జైన్ మాట్లాడుతూ  తమ కర్నూలు ప్లాంట్‌లో ప్రపంచ స్థాయి డానియెలి ఈసీఆర్ సాంకేతికతను ఉపయో గించడం ద్వారా, కంపెనీ ఇప్పుడు ‘భారతదేశంలో అత్యుత్తమ నాణ్యత గల బార్లను తయారు చేస్తోంది, ఇవి దేశంలోని కొన్ని ప్రముఖ ఉత్పత్తిదారుల కంటే మెరుగ్గా ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు.

దేశం మారుతున్న మౌలిక సదుపాయాలకు అవసరమైన ‘విడదీయలేని నమ్మకాన్ని’ అందించడానికి జై రాజ్ అటూట్ ప్రత్యేకంగా రూపొందించబడిందని, తద్వారా సురక్షితమైన, బలమైన భారతదేశం కోసం అధిక-డక్టిలిటీ, భూకంప నిరోధక పరిష్కారాలను అందించడంలో జై రాజ్ ఇస్పత్ అ గ్రగామిగా నిలుస్తుందని జైన్ వివరించారు.