17 April, 2026 | 7:18 PM

దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థ

04-06-2025 12:37 AM
  1. 7.4 శాతానికి చేరుకున్న జీడీపీ వృద్ధి రేటు
  2. ముందుండి నడిపిస్తున్న నిర్మాణ, సేవా రంగాలు

ముంబై, జూన్ 3: భారతదేశ ఆర్థిక వృద్ధి వేగంగా పుంజుకుంది. దేశ జీడీపీ 7.4 శాతంగా దూసుకెళ్తుంది. నిర్మాణ, సేవా రంగాలు ముందుండి ఎకానమీని నడిపిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో ఆర్థిక వృద్ధి బలమైన పనితీరును కనబరిచింది. ఆర్థిక వ్యవస్థ బలంగా తిరిగి పుంజుకుంది. వార్షిక సగటును మించి రాణించింది. జనవరి-మార్చితో ము గిసిన 4వ త్రైమాసికానికి వాస్తవ జీడీ పీ వృద్ధి 7.4గా నమోదైంది.

గడిచిన మూడు క్వార్టర్లతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలోని అత్యంత వేగంగా వృ ద్ధి నమోదైంది. ఆర్‌బీఐ అంచనా వేసిన 7.2 శాతాన్ని మించి జీడీపీ నమోదవడం గమనార్హం. అదే సమయంలో నామమాత్ర జీడీపీ 10.8 శాతానికి చేరుకుంది. విలువ పరంగా చూసుకుంటే రూ. 88.18 లక్షలకు చేరువైంది. మూడో త్రైమాసికంలో 6.3 శాతంగా ఉన్న జీవీఏ వృద్ధి రేటు నాలుగో త్రైమాసికంలో 6.5 శాతంగా నమోదైంది.